కేంద్ర ప్రభుత్వ నేషనల్ వెక్టర్ బోర్న్ సీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ సహకారంతో పేదలకు దోమతెరలు పంపిణీ
మహారాణి పేట, పెన్ పవర్
కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ శాఖ వారు ,కేంద్ర ప్రభుత్వ నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ సహకారంతో పేదలకు దోమతెరలు పంపిణీ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ ఈ కాలంలో దోమలు అధికంగా రావటం వలన పెద్దలకు,పసిపిల్లలకు దోమ కాటు వలన అనేక రకముల విషజ్వరాలు వస్తాయని, ఈ దోమ కాటు వలన డెంగ్యూ ,మలేరియా ,చికెన్ గునియా , పైలేరియా ఇంకా అనేక రకాల వ్యాధుల వలన మన ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ప్రధాని మోడీ సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అమాత్యులు డాక్టర్ హర్షవర్ధన్ ఆదేశానుసారం విశాఖ ప్రజలకు ఈ రోజున ఖరీదైన,నాణ్యమైన దోమ, క్రిమి,కీటక,బొద్దింక నాశన కారి అయినా దోమ తెరలను పంపిణీ చేశారు.ఈ దోమతెరలు దుమ్ము ,ధూళి లను దరి చేరనీయదు అని,20 సార్లు పైగా దీనిని వాష్ చేసుకోవచ్చు అని ,ఈ దోమ తెరలను ప్రత్యేకంగా సూక్ష్మ రంధ్రం లతో కలిగినవిగా తయారు చేయబడినవి అని అన్నారు.ఇది చాలా బరువు తక్కువ గల ,నాణ్యమైన దిగా తయారు చేయబడినది అని అన్నారు.ఈ దోమతెర వాడకానికి ముందు 24 గంటల పాటు పొడి వాతావరణంలో ఉంచాలని ,పసి పిల్లలకు దూరంగా ఉంచాలని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రధాని మోడీ సూచించిన ఆరోగ్య రక్షణకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి,డాక్టర్ వై.లక్ష్మణ్ రావు ,డాక్టర్ ఎల్ హరి వదన్ ,గేదెల శ్రీహరి ,జి.రమణ ,రాము,మంగ మొదలగువారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment