ప్రతి వ్యక్తి కరోనా జాగ్రత్తలు పాటించాలి. ఎస్సై విజయ రామ్ కుమార్
చిన్నగూడూరు, పెన్ పవర్స్థానిక మండల కేంద్రంలోని బుధవారంనాడు ప్రతి ఒక వ్యక్తి కరోనా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై విజయ్ రామ్ కుమార్ తెలిపారు.స్థానికులకు కోవిడ్ -19 నియంత్రణపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. గ్రామాల్లో గుంపులుగా సంచరిస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన, రోడ్డు నియమాలు పాటించకుంనా భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు. ప్రతి వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారి పై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది చందర్, రాము తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment