ముహూర్తానికి మోక్షమెప్పుడు …?
పేదోడి సొంతింటి కళ నెరవదెన్నడు ......?
రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్
నిరుపేదలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిరుపేదల , బడుగు బలహీన వర్గ ప్రజల సంక్షేమ దిశగా అనేక రకాల పధకాలను ప్రవేశపెట్టింది . రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పధకాలలో అతి ప్రదానమైనది. రెండు పడకల గదుల నిర్మాణం చేపట్టడం. వసతి సౌకర్యాన్ని కల్పించే దిశగా రెండు పడకల గదులను నిర్మింఛి దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద ప్రజానికానికి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
జోరుగా ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములోని రాచర్ల గొల్లపల్లి, వెంకటాపూర్, రాచర్ల బొప్పాపూర్, కోరుట్లపేట గ్రామలలో నిర్మించిన రెండు పడకల గదుల నిర్మాణం పూర్తయి ప్రారంబోత్సవం , ఇళ్ళ పట్టాల పంపిణీల స్తితి గతులు అందుకు బిన్నంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం అర్హులైన లబ్ధిదారులకు నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్య ఉద్దేశం అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించి ప్రచారం హంగు ఆర్భాటాలు కూడా ఎక్కువే కానీ నిరుపేదలకు ఇప్పటికీ డబుల్ బెడ్ రూములు అందకపోవడం వల్ల లబ్ధిదారులకు నిరాశనే మిగిల్చింది.
గత చరిత్ర ఎల్లారెడ్డిపేట పట్టణము చివరిలో స్థలములో దివంగత నేత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాములో ఇందిరమ్మ ఇల్లు అనే పదకము ద్వారా నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణం చేపట్టి అర్హులైన లబ్దిదారులకు అందించి పేదల సొంతింటి కళను నెరవేర్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.
పదకొండు కోట్ల వ్యయం అయితే టిఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో లో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వగా , మిగిలిన ఖాళి స్థలములో సుమారుగా నాలుగు ఎకరాల విస్తీర్ణములో నిర్మించే 168 రెండు పడకల గదుల నిర్మాణానికి 2016 సంవత్సరములో సరిగ్గా దసరా సమయములో మూహుర్తాలు చేసి , నిర్మాణాలు ప్రారంభించడముతో అధికారుల , స్థానిక ప్రజా ప్రతినిధుల అలసత్వముతో పాటు , ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కొరతతో పాటు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యముతో ఆలస్యంగా మూడు అంతస్తుల ఎత్తుతో రెండు పడకల గదులను పదకొండు కోట్ల వ్యయముతో ఒక్కొక్క ఇంటికి ఆరు లక్షల వ్యయంను వెచ్చించి ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను పూర్తీ చేసారు.
మొదటి నుండి ఎంపిక వరకు లోపాలే
అయితే నిర్మించిన 168 ఇళ్ళ పట్టాలను అందించేందుకు గాను నిరుపేదల నుండి 350కి పైగా దరఖాస్తులను స్వీకరించారు. స్థానిక రెవెన్యు అధికారులు . ఇళ్ళ పట్టాలు అర్హులకు కట్టబెట్టాలన్న దిశగా ఎల్లారెడ్డిపేట లో అధికారులు సర్వే నిర్వహించి ,మొదటగా 134 దరఖాస్తుల దారులు మాత్రమె అర్హులుగా గుర్తించడముతో , సమగ్ర సర్వే లోపా భూష్టంగా ఉందంటూ నిరాశ్రయులైన లబ్దిదారులు మరో మారు స్థానిక తహశిల్దార్ శ్రీకాంత్ కు ధరఖాస్తులు పెట్టుకోగా , తూతు మంత్రంగా సమగ్ర సర్వే చేపట్టి రెండో సారి దరఖాస్తు పెట్టుకున్న వారిలో 148 మంది లబ్దిదారులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా అనర్హులను అర్హులుగా చూపెట్టే ప్రయత్నం జరిగింది అనే గుసగుసలు వినబడుతున్నాయి కొందరు నాయకులు ప్రజాప్రతినిధులు వారికి సంబంధించిన వారికే డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించుకుని ప్రయత్నం చేశారు. రెండో సారి సమగ్ర సర్వే చేపట్టగా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చినట్లు సమాచారం.
ప్రతిపక్షాలు అర్హులకు ఇవ్వాలి అంటున్నారు అయితే ఇది ఇలా ఉండగా .... కే టి ఆర్ నియోజక వర్గములో నిరుపేదలకు సొంత గూడును నిర్మించి అందించాలన్న లక్ష్యం సరైనది అయునప్పటికి , రెండు పడకల గదుల నిర్మాణాలు పూర్తీ అయ్యి నేటికి సంవత్సరా కాలం పూర్తీ కావొస్తున్న నేటికి ఇప్పటికి కూడా నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా అధికారులు , స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వైఖరి చెప్పాలని డీమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షుడు దొమ్మాట నర్సయ్య. లోపం ఎవరిది ఇల్లు లేకుండా బెక్కు బెక్కుమని ఎదురు చూస్తున్న పేదవానికి ఇల్లు ఎప్పుడు ఇస్తారో తెలియని అయోమయములో ఉన్న పేదవానికి ఇల్లు ఇవ్వడములో అధికారుల లోపామా ?,
స్థానిక ప్రజా ప్రతినిధుల లోపామా ,?,
తెరాస నాయకుల లోపామా ?,
సమగ్ర సర్వే లోపామా అని ప్రశ్నించారు.
నిష్పక్షపాతంగా ఎంపిక జరగాలి రెండు పడకల ఇళ్ళను ఎవరికీ కేటాయించాలి. ఎవరు లబ్దిదారుడు , ఎవరికీ ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు ., ఎవరు నిరుపెదవాడో గుర్తించాల్సిన భాద్యత సమగ్ర సర్వే చేసే అధికారులపై ఉన్నదని అన్నారు నిష్పక్షపాతంగా సర్వే చేయాల్సిన అధికారులు నాయకుల రికమండేషన్ లతో ఎవరికి అయితే ఏంటి ఇచ్చావా లేదా అన్నట్టుగానే లబ్ధిదారులను ఎంపిక చేశారు . ఇల్లు ఉన్న వారికి స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ వచ్చింది అని చెప్పినా పట్టించుకునే నాధుడే లేడు. ఎవరు లబ్దిదారులో నిర్ణయించేందుకుగాను గ్రామా సభ ఏర్పాటు చేసి , గ్రామా సభలో ఎవరు అర్హులు , ఎవరు అనర్హులు అని ప్రజలే నిర్ణయిస్తారు తప్ప . నాలుగు గోడల మధ్యన తూతూ మంత్రంగా లబ్దిదారుల్ని నాయకులు గుర్తించి అర్హులు వారేనని మీ యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం తీసుకొని ప్రకటించడం పేదవానికి ఆన్యాయం చేసినట్లే అని విమర్శించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన రెండు పడకల ఇల్లు పేదవానికి సరైన సమయానికి అందించని ఇల్లు దేనికని ఎద్దేవా చేసారు.
తెరాస కార్యకర్తలు నాయకులు అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఇళ్ళను కేటాయించాలని, లేదా తమ బందువులకు తమ కార్యకర్తలకు అంటూ ఇళ్ళను కేటాయిస్తే మండల కాంగ్రెస్ నాయకులు రెండు పడకల ఇళ్ళ సముదాయాల వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. డ్రా నిర్వహించి నెలలు గడుస్తున్న లబ్ధిదారులకు అందని ద్రాక్షలాగే మిగిపోయాయి. ఇప్పటి కైనా అర్హులతో పాటు , లోపాలను గుర్తించి ఈ సంవత్సరం ఉగాది కల్లా నిరుపేదలకు ఇళ్ళను కేటాయించి , పట్టాలను పంపిణి చేస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి..
No comments:
Post a Comment