డబ్బు – ప్రేమ ఏది గొప్పది
కమృనిషా ప్రొడక్షన్స్ బేనర్ పై లఘు చిత్రం...విశాఖ, పెన్ పవర్
విజయనగరం కు చెందిన ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్స్ బృందం “ కమృనిషా ప్రొడక్షన్స్ “ బేనర్ పై “ హార్ట్ బీట్ “ ( రెండు హృదయాల కధ ) అనే లఘు చిత్రాన్ని నిర్మాణం చేస్తున్నారు. ప్రపంచంలో రెండక్షరాల పదాలైన డబ్బు – ప్రేమ అనే అంశాలలో ఏది ముఖ్యం అనే అంశం పైనే కథ అంతా నడుస్తుందని. యువతరానికి ఆయా అంశాలపై ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని తీస్తున్నామని ఇది పూర్తిగా ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే ప్రేమ కధా చిత్రమని , విజయనగరం , వైజాగ్ , అరుకు ప్రాంతాలలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నమని , ఇందులో హీరో గా అబ్దుల్ రెహమాన్ , హీరోయిన్ గా ఇన్స్టాగ్రాం హారిక తేజు , సహా నటులుగా ఇప్పిలి , కావ్య , సతీష్ లు నటిస్తున్నారని , కెమెరామెన్ గా వెంకి , సహా దర్శకులు గా గంటా మహేష్ , నాగార్జున లు వ్యహరిస్తున్నారని చిత్ర దర్శకుడు జవ్వాది రాజు తెలిపారు.
No comments:
Post a Comment