ఐక్య పోరాటం ద్వారానే స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలం ..
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తివిశాఖపట్నం,పెన్ పవర్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని బీజేపీ నాయకులు రాష్ట్రంలో డప్పు కొట్టగా, దీనికి విరుద్ధంగా పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కులో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తామని ప్రకటన చేయడం బీజేపీ ద్వంద వైఖరి మరోమారు బట్టబయలు అయ్యిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టాలని, రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగించినప్పుడే విశాఖ స్టీల్‌ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోగలమని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment