శాసనమండలి ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి..
శామీర్ పెట్ లోని బ్యాలెట్ బాక్సుల గోడౌన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
మేడ్చల్ ,పెన్ పవర్
మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మంగళవారం జిల్లాలోని శామీర్ పెట్ లో గల ఎమ్మెల్సీ ఎన్నికల గోడౌన్ ను అక్కడ ఉన్న భద్రత వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసిందని ఇప్పటికే సరిపడా సిబ్బందిని నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు మిగతా ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.. ఈ నేపథ్యంలో సరిపడా బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి 250 కరీమ్ నగర్ జిల్లా నుండి 218 బ్యాలెట్ బాక్సులను కూడా జిల్లాకు తీసుకువచ్చారు .ఈ సందర్భంగా జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ముందుగానే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అలాగే బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళేందుకు అవసరమైన 41 రూట్లలో రవాణా ఏర్పాట్లను చేయడంతో పాటు సిబ్బందికి బస్సులను ఏర్పాటు చేసి వారు ఎన్నికల కేంద్రాలకు వెళ్ళేందుకు తగిన బందోబస్తు కల్పించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు.. ఎన్నికల కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని సమకూర్చాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్, తహశీల్దార్, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
[18:17, 3/9/2021] +91 94404 28241: Next
No comments:
Post a Comment