పుస్తకాలు మోసే వయసులో..పుస్తెల భారం వద్దు
బాల్య వివాహాలపై ప్రత్యేక నిఘామహా శివరాత్రి సందర్భంగా బలవంతపు బాల్య వివాహాలు జరగకుండా చర్యలు
సచివాలయాల మహిళ పోలీసులతో సమావేశమైన ఎసై పురుషోత్తం రెడ్డి
చిత్తూర్,పెన్ పవర్
సత్యవేడు నియోజకవర్గం- వరదయ్యపాళెం మండలంలోని పాండూరు జోతీశ్వరాలయంలో శివరాత్రి మరుసటి రోజు స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం జరుగుతున్న సందర్భంగా(శుక్రవారం) అదే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు కొంతమంది పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీ.ఈ క్రమంలో బాల్యవివాహాలు జరగకుండా పోలీసులు ఐసీడీసీ,అధికారులతో కలిసి అడ్డుకోవడానికి తగు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపిన ఎసై పురుషోత్తం రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా ఎసై మాట్లాడుతూ జోతీశ్వరాలయం లో జరుగు శివరాత్రికి మరియు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి స్థానిక భక్తులతో పాటు సరిహద్దుల్లో ఉన్న నెల్లూరు జిల్లా, తమిళనాడు ప్రాంతాల నుండి వస్తుంటారని వారు ఖచ్చితంగా మాస్క్ లు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని, పెళ్లిళ్లు చేసుకొనే వారు తమ వయసు ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని ముందుగా ఆలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని. మావినపని కాదని బలవంతపు బాల్య వివాహం చేయాలని ప్రయత్నం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆలయం వద్ద పోలీసు శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు పూర్తిస్థాయిలో చేస్తామని తెలిపారు.ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్ళి చేసి బాధ్యత తీరిందని చేతులుదులుపుకోవలనుకొనే తల్లిదండ్రులు తమ కూతురు భవిషత్తులో ఏవిధంగా ఉంటుందో ఆలోచించాలని చిన్న వయసులోనే సంసార బాధ్యతలు-ఆపై ప్రసవాలు. దీనివలనమానసికంగాఒత్తిడి,శారీరకంగాఆరోగ్యసమస్యలుతలెత్తుతాయని వివాహానికి అధికారికంగా ప్రభుత్వం నిర్దేశించిన వయస్సులో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఎలాంటి ఇబందులు తలెత్తవాని.అయిన ప్రస్తుతం ప్రభుత్వం కూడా మహిళ సాధికారికత కోసం ప్రత్యేకం గా దృష్టి పెట్టి వారికి పథకాలు అమలు చేస్తుందని తమ పిల్లలకు విద్య వాంతులు చేసి సమాజంలో తమ కాళ్లపై తాము నిలబడే విధంగా తీర్చిదిద్దే పద్ధతి తల్లిదండ్రులు ఆలోచించమని ఎసై పురుషోత్తం రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment