అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం....
ఇంద్రవెల్లి, పెన్పవర్
ఇంద్రవేల్లి మండల అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సర్కాలే శీవాజీ, మండల కమిటీని శుక్రవారం రాత్రి మండలంలోని సట్వాజీగూడ గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. ముందుగా గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం త్రిశరణ్, పంచశీల బుద్ద వందనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్కాలే శీవాజీ మాట్లాడుతూ సామాజిక సేవలో బడుగు, బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతికి కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవనే శత్రుగన్, ప్రధాన కార్యదర్శి ఆచార్య దత్తా, మండల నాయకులు గాయక్ వాడ్ భారత్, వార్డు సభ్యులు థిట్టే నాగరాజ్, గ్రామస్థులు బామ్నే చంద్రకాంత్, కాంభ్లే దాదారావు, గౌతమ్, జంధడే బాలాజీ, సూర్యవంశీ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment