బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికిన ఎల్లారెడ్డిపేట
భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ముస్తాబాద్ మండంలం గుడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ నుండి మంగళవారం వెళుతున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరపున మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి సంజయ్ కుమార్ కు శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన గోపి జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గా రెడ్డి జిల్లా అధికార ప్రతినిధులు నేవూరి దేవేందర్ రెడ్డి బందారపు లక్ష్మారెడ్డి మండల నాయకులు మీనా ఖాన్ చందుపట్ల లక్ష్మారెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment