ముందుస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒక్క రోజు దీక్ష..
వేములవాడ, పెన్ పవర్చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తు వేములవాడ పట్టణంతో సహా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గృహనిర్బంధం, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడానికి తప్పుబడుతూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అది శ్రీనివాస్ తన నివాసంలో ఒక్కరోజు దీక్షను చేపట్టారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో లేని నాయకుని పట్ల ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తున్నప్పటికీ ఈ ప్రాంత సమస్యలు ప్రశ్నించేవాడు అసెంబ్లీలో లేడు కాబట్టి నియోజకవర్గ ప్రధాన సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవడానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేయడం తప్పా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నమన్నారు. ఈ అక్రమ ముందస్తు అరెస్ట్ ను ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.. దీక్షలో పాల్గొన్న నాయకులు నిత్యానంద రావు, నల్ల నాగిరెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్. కనికరపు రాకేశ్. లింగంపల్లి కరుణకర్.షేక్ సాబీర్ , కోయల్ కార్ మస్తాన్. తంగెళ్ల గణేష్ గుడిసె కర్ణాకర్, ఎర్ర శ్రావణ్. పళ్ళకొండ అమర్, సచిన్, సాయి, దినేష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment