Followers

బేల లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

 బేల లో శనగ  కొనుగోళ్లు ప్రారంభం...

బేలా, పెన్ పవర్ 

 శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల  మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో శనగ కొనుగోళ్లు ప్రారంభమాయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్ హాజరై మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతులకు పెద్దన్నలా కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందని అన్నారు. మండల రైతులు నాణ్యమైన శనిగా తీసుకువచ్చి మద్దతు ధర తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్ని చట్టాలు వ్యతిరేకంగా తీసుకొచ్చిన,  తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడి రైతులకు మద్దతు ధర ఇస్తుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఆడానేశ్వరా ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జక్కుల మధుకర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్లెం ప్రమోద్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు  ఠాక్రే గంభీర్, టిఆర్ఎస్ నాయకులు వైద్య కిషన్, సంతోష్,జితేందర్, రఘు కూల్ రెడ్డి,  సతీష్,  సంతోష్, విపిన్, సుధాం రెడ్డి, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...