ఊరికి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మందమర్రి,పెన్ పవర్
రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు కాలనీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల నుండి రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తూ వారి వేలి ముద్రలు మొబైల్ చెక్ డివైస్ ద్వారా సేకరిస్తున్నామని రామకృష్ణాపూర్ ఎస్సై కటిక రవి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రజలు తీర్థయాత్రలకు తమ అవసరాల నిమిత్తం ఇంటిని వదిలి వేరే ఊరికి వెళ్లినప్పుడు వారు తమ వివరాలు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారస పడి నట్లయితే వారి వివరాలను పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా తమ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల వారిని లేదా ఇతర రాష్ట్రాల వారిని తీసుకు వచ్చినప్పుడు వారి వివరాలు ఆధార్ కార్డు తో సహా పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటిని వదిలి వెళ్ళినప్పుడు వారి వివరాలు ఈ నెంబర్, 100, 6309825776, 9440795039 లకు ఫోన్ చేసి వారి వివరాలు తెలపాలని కోరారు.
No comments:
Post a Comment