ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలి
మందమర్రి, పెన్ పవర్ప్రజలు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్,చార్టర్ అధ్యక్షులు సొత్కు సుదర్శన్, మందమర్రి కార్యదర్శి కౌట్ల అనితలు కోరారు. మందమర్రి మార్కెట్ ప్రాంతంలో సోమవారం లయన్స్ క్లబ్ మందమర్రి ఆధ్వర్యంలో వినియోగదారులకు సుమారు 200 నార సంచులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈఎంటి కోఆర్డినేటర్ హనుమాన్ల రాజిరెడ్డి సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి, నార సంచులను పంచడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రజలకు నీటి ప్రాముఖ్యతను వివరించారు. వేసవి కాలం దృష్ట్యా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. నీటిని వృథా చేస్తే డబ్బులు వృధా చేయడేమని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ దామెర్ల సిద్దయ్య, జిల్లా చైర్మన్ పోలు శ్రీనివాస్, మందమర్రి అధ్యక్షులు చిలగాని సుదర్శన్, కోశాధికారి ఆరుసవెళ్లి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు కొక్కుల కేదారి, సభ్యులు తౌటo శ్రీనివాస్, పెండ్యాల గౌతం, పల్లే నరసింహులు, తాడెపు శ్రీనివాస్, పూసాల వెంకట రత్నం, సకినాల శంకర్, నర్సొజి, లూతర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment