విద్యార్థి సంఘాల బైటాయింపు
కూకట్ పల్లి,పెన్ పవర్
కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఎన్ బండారి ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులపై చేస్తున్న దౌర్జన్యం, బెదిరింపులకు నిరసనగా బుధవారం విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఛాంబర్లో బైఠాయించి ధర్నా చేసిన ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ప్రిన్సిపాల్ బండారి కొందరిని బినామిగా ఏర్పాటు చేసుకొని, తన సొంత నిబంధనలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎస్.సి, ఎస్.టి ఉద్యోగులను బెదిరిస్తూ, కక్ష్య పూరితంగా వ్యావహారిస్తున్నాడని, అన్యాయంపై ప్రశ్నిస్తున్న వారిని లేపేస్తా అని, అంతు చూస్తా అని, నా ప్రవర్తన ఇలానే ఉంటుంది, మీరు ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకొండని ఉద్యోగులను కలవకుండా, వారికి చెలించాల్సిన జీతాలలో కూడా అవకతవకలు పాల్పడుతున్నారని, తనకు నచ్చిన వారికి ఒక జీతం, నచ్చని వారికి ఒక జీతం ఇస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తునడాని ఆరోపించారు. ప్రిన్సిపాల్ వ్యవహారంపై రెండు నెలల క్రితం ఎస్.సి, ఎస్.టికమిషన్ లో ఉద్యోగులు పిర్యాదు చేసారని దీనితో వారిపై మరింత కక్ష్యతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో జె.ఎన్.టి.యూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల జేఏసీ, తెలంగాణ టెక్నాకల్ విద్యార్థి సంఘం, ఎస్.సి, ఎస్.టి విద్యార్థి సంఘం, బంజారా విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment