తెలంగాణా సేవారత్న అవార్డు ప్రధానం...
పెన్ పవర్, కందుకూరు
జనార్ధన కాలనీ లో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయురాయలు రామలక్ష్మమ్మ కి, కమ్మ పాలెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజా కుమారికి కన్నతల్లి ఫౌండేషన్ వరంగల్ వారు ఇచ్చినటువంటి తెలంగాణ సేవరత్న అవార్డులను శ్రీరామ సాయి బాబా సేవా సమితి అధ్యక్షులు రవ్వ శ్రీనివాసులు,ప్రకాశం జిల్లా వాసులు సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం నాడు మహిళా ఉపాధ్యాయురాలును గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.నేడు సమాజంలో మహిళలు రాజకీయరంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగాల్లో, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.ఒక మహిళ తమ కుటుంబానికి ఎన్నో సేవలు చేస్తూ తమ కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్న దని అన్నారు.అటువంటి మహిళా సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. రవ్వా శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యారంగంలో పిల్లలను ఉన్నత స్థాయికి తీర్చే క్రమంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది అన్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి వారి ఉన్నత స్థితికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాలకొండయ్య, మాధవరావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment