Followers

గర్భిణీలకు వైద్యపరీక్షలు

 గర్భిణీలకు వైద్యపరీక్షలు

 పెన్ పవర్,కరప

స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ ఆభయాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్.శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సోమిరెడ్డి శిరీష వైద్యపరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జిల్లా పబ్లిక్ నర్సింగ్ ఆఫీసర్ ఎస్.ఉషశ్రీ మాట్లాడుతూ ప్రతినెల గర్భణీలు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహాలు పాటిస్తే సుఖప్రసవాలు జరుగుతాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీహెచ్సీ సిబ్బంది గర్భిణీలకు రక్తపరీక్షలు, బీపీ, షుగరు టెస్ట్లు నిర్వహించి, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించడం జరిగిందని, వారిపట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకుని, వైద్యపరీక్షలు నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వైద్యసిబ్బంది తెలిపారు. ఎంపీ హెచ్ ఓ కె.కిశోర్, వైద్య సిబ్బంది ఎస్.మల్లిఖార్జున్, టీబీటీ సుందరి, సత్యవతి, ఉషాకుమారి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...