Followers

మహిళలు చైతన్యవంతమైన శక్తి

 మహిళలు చైతన్యవంతమైన శక్తి - రాష్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

సృష్టికి మూలం మహిళలని, మహిళా శక్తి లేనిదే సమాజమనుగడ ఒక్క క్షణం కూడా మనుగడ లేదని కావున మహిళలు ఒక చైతన్యవంతమైన శక్తి అని *రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల,పెన్ పవర్


 సోమవారం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో  మంత్రి కొప్పుల ఈశ్వర్ విశీష్ట అతిధిగా పాల్గోన్నారు.   ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో మహిళల సాంప్రదాయాలు పద్దతుల ప్రత్యేకతలను గమనిస్తే మహిళల ఔనత్యం, సమాజంలో వారికి కల్పిస్తున్న ప్రత్యేకతను గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతామని అన్నారు.   మహిళలు అనేక  ఒత్తిడులు, వివక్షలకు గురికాకుండా చూడాల్సిన బాద్యత మనందరిపై ఉందని పేర్కోన్నారు.  నూటికి 75% మంది మహిళలు వారిపరిస్థితులను బట్టి సర్దుకుపోతు జీవనగమనాన్ని సాగిస్తున్నారని, చట్టాలు ఎన్ని ఉన్నప్పటికి వాటి అమలులో, ఆచరణలో మార్పు ఇప్పుడిప్పుడే వస్తుందని అన్నారు.  మహిళలు స్వేచ్చాయుతంగా ముందుకు సాగితే అనితర సాద్యమైన విజయాలను సైతం సాధించగలరని అన్నారు. సమాజంలో చట్టాలు ఎన్ని అమలు పరిచినప్పటికి మహిళపై పురుషుల ఆదిపత్యం ఇంకా కోనసాగుతుందనేది ఒప్పుకోకతప్పదని ,ఈ ఆదిపత్యంపై మహిళలు పోరాడి, ప్రశ్నించడం ద్వారానే విజయాన్ని సాధించాలని పేర్కోన్నారు.   చిన్న వర్గాలైన ఎస్సి, ఎస్టి మరియు అటవి ప్రాంతాలలో చిన్న వయస్సులో పెళ్లిలు జరుగకుండా నిరోదించిందని, ఆడపిల్లల పెళ్లిని తల్లితండ్రులు బారంగా బావించకుండా, 18 సంవత్సరాలు పైబడిన పెళ్లిచేసుకున్న మహిళలకు కళ్యాణలక్ష్యి, షాధిముబారక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మహిళల అభ్యున్నతి ఎల్లవేల్లల ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కోన్నారు. అంగన్ వాడి, ఆశా, పారిశుద్య కార్మికులు మొదలకు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా మహిళా ఉద్యోగులకు సమాన వేతనాలను అందించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కేజి టు పీజి విద్య ఖచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతో అంగన్ వాడి కేంద్రాలలో టిచర్లకు ఆంగ్లవిద్యపై శిక్షణను అందించి, ఆంగ్లవిద్యపై పిల్లలు బయబ్రాతులకు గురికాకుండా మక్కువ పెంచుకునే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు .మైనారిటి, బిసి మరియు సంక్షేమ విద్యాలయాలలో బాలికల సంఖ్య ఎక్కువ ఉందని, ఇది భవిష్యత్తులో స్త్రీలదే కీలకమనేది నిదర్శనంగా గుర్తించుకోవాలని అన్నారు.  ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు మహిళలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనిదని, ఇంట్లో జరిగే ఏ కార్యక్రమంలోనైన ఎక్కువగా శ్రమించేది మహిళలే అని అన్నారు. రానున్న కాలంలో మహిళలు అన్నిరంగాలలో విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.  మహిళలకు అర్థిక బరోసాను కల్పించాలనే లక్ష్యంగా జిల్లాలో పైలెట్ ప్రాజేక్టుగా ప్రవేశ పెట్టిన సహజ ప్రాడక్టు పై అందరిలో విశ్వాసాన్ని కలిగించేలా మహిళలు కృషిచేసి ఘనవిజయాన్ని సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు పిడి డిఆర్డిఎ లక్ష్మీనారాయణ డి డబ్ల్యూ ఓ నరేష్ మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఇ సుందరరాజన్ మహిళలు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...