సమస్యలను పరిష్కరించే విధంగ చూడాలి
..ఎంపీపీకళ్యాణం లక్ష్మి
ఎంపీపీకళ్యాణం లక్ష్మి రాజేశ్వర్ అధ్వర్యంలో తలమడుగు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జెడ్ పి టి సి గోక గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలువురు సర్పంచ్లు, ఎమ్ పి టి సి లు గ్రామాల సమస్యలు విన్నవించడంతో ఆయా సమస్యలు మండల అధికారులచే సమాధానం ఇప్పించి సమస్యలను పరిష్కరించే విధంగ చూడాలని అధికారులను కోరారు. మండల పలు సమస్యలను త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగ చూస్తానని జెడ్ పి టి సి గోక గణేష్ రెడ్డి సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాకాంత్,ఎమ్మార్వో ఇమ్రాన్ ఖాన్, మరియు వివిధ శాఖల అధికారులు, మండల సర్పంచులు,కో ఆపరేషన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment