విఆర్ఓ లు అందుబాటులో ఉండాలి..
పెన్ పవర్,వలేటివారిపాలెం
ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో నోడల్ విఆర్ ఓ లు అందుబాటులో ఉండాలని తహశీల్దార్ ముజఫర్ రెహమాన్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్డు దారులు గత నెలలో రేషన్ తీసుకోక పోతే గత నెల రేషన్, ప్రస్తుత నెల రెండు కలిపి ఒకేసారి రేషన్ తీసుకోవచ్చని అన్నారు. డోర్ డెలివరీ చేసే సమయంలో నోడల్ విఆర్వోలు రేషన్ మినీ ట్రక్కుల వెంట ఉండాలని చెప్పారు. కచ్చితంగా డోర్ టు డోర్ బండి ఆపి రేషన్ పంపిణీ చేయాలని చెప్పారు. మినీ ట్రక్కు వెల్ల లేని పరిస్థితుల్లో తప్ప లేకుంటే, ఎక్కడా కూడా బండి ఒక చోట ఆపి రేషన్ పంపిణీ చేయరాదన్నారు. గుంపులు గుంపులుగా చేరి అసలు రేషన్ పంపిణీ చేయకూడదని చెప్పారు. ప్రతి కార్డు దారుడికి రేషన్ తో పాటు సంచులు ఇవ్వాలన్నారు. మండలంలో మొత్తం 13,080. కార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు . రోజుకు కనీసం 90 కార్డులు చేయాలని చెప్పారు. వాలంటీర్లు వారివారి పరిధిలో ఉన్న 50 ఇళ్లకు ముందుగా రేషన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది తెలియజేయాలని చెప్పారు. ఎక్కడైనా డోర్ డెలివరీ చేయకుండా ఒకే చోట బండి ఆపి రేషన్ పంపిణీ చేస్తే నోడల్ విఆర్ఓ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
No comments:
Post a Comment