Followers

కేంద్రంలో బిజెపి పరిపాలన ...మోడీ వల్ల దేశానికే తిరని నష్టం.. శాంత కుమారి

 కేంద్రంలో  బిజెపి పరిపాలన ...మోడీ వల్ల దేశానికే తిరని నష్టం.. శాంత కుమారి

అరకు, పెన్ పవర్

మోడీ తిరు దేశనికే నష్టం అని పి సి సి ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి అన్నారు. శుక్రవారం భారత్ బంద్ సందర్భంగా  రైతుల ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ  సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులు గత వంద రోజులుగా నిరసనలు చేస్తున్నారని. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడంతో గత నెలలో ఒకసారి భారత్ బంద్ ను నిర్వహించారని.కాగా, నేడు రెండోసారి భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కి సహకరిస్తున్నారని అత్యవసర సర్వీసులు మినహా అన్నీ మూతపడ్డాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు దేశంలో ఇంతమంది మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని అన్నారు బంద్ కు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు, సాగు చట్టాలను కేంద్రం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం రైతు సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉదృతం చేస్తామని  రైతుల భారత్ బంద్ కు దేశవ్యాప్తంగానూ, ఇతర దేశాలలోని భారతీయుల నుండి విపరీతమైన మద్దతు లభిస్తుందని. ఇప్పటికే బంద్ కు మద్దతు ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీలు రైతుల కోసం ఆందోళన బాట పట్టాయి. 

తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసనలను తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో  ఉద్యమాన్ని అప్లై చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని చెప్పారు వ్యవసాయ చట్టాల విషయంలో ప్రభుత్వ తీరు రద్దు చేసుకునే లాగా కనిపించడం లేదని. సుమారు 300 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఏదో విధంగా రైతులకు నచ్చజెప్పి ఆందోళనలు విరమించేలా చెయ్యాలని భావిస్తుందని. కానీ రైతులు పట్టిన పట్టు విడవటం లేదని. ఒకే మాట మీద ఉన్నారని. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విశాఖపట్నం లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించం హక్కు  మీకు ఎవరు ఇచ్చారు అని  శాంతకుమారి  ప్రశ్నించారు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అంతంతమాత్రంగా ఉన్న  బిజెపి  నామరూపాలు లేకుండా పోతుందని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మొస్య  ప్రేమ్ కుమార్, మండల కార్యదర్శి తడబారికి భీమారావు రైతు సంఘాలు అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలు యువత తదితరులు పాల్గొనడం జరిగింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...