అలుపనకనకరెడ్డి చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ
మహారాణి పేట, పెన్ పవర్
కరోనానివారణకు మాస్కులు ధరించిన విధంగా జ్వరాల నివారణకు దోమతెరలు వాడాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డుఅధ్యక్షులు అలుపనకనకరెడ్డి చేతుల మీదుగా గణేష్ పాఠశాల ఆవరణలో వార్డు వున్నా ప్రజలకు దోమతెరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలం ఒకవైపు కరోనాతో పాటు మరోవైపు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, దీన్నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టిందన్నారు.డెంగీ,మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా దోమతెరలు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ దోమ తెరలను ప్రత్యేకమైన రసాయనాలతో తయారు చేశారని, దోమలు వీటిపై వాలిన వెంటనే చనిపోతాయిని తెలిపారు.రెండో దశ కరోనా ప్రభావం అధికమవుతుందని, కనుక ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులు,శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని కనకరెడ్డి ప్రజలకు సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో మలేరియా డిపార్ట్మెంట్ సిబ్బంది వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment