Followers

తాళ్ళపూడి మండల టైలర్స్ యూనియన్ తరపున దేశాబత్తుల దావీదు కు ఆర్థిక సాయం

 తాళ్ళపూడి మండల టైలర్స్ యూనియన్ తరపున దేశాబత్తుల దావీదు కు ఆర్థిక సాయం

తాళ్ళపూడి,పెన్ పవర్

తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన టైలర్స్ యూనియన్ సభ్యులు దేశాబత్తుల దావీదు రోడ్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబం ఇతనిపై ఆధారపడి ఉంది. ఇతను టైలరింగ్ వృత్తిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి తాళ్ళపూడి మండల టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ తరపున 25 కేజీల బియ్యం, 1000 రూపాయల నగదు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దావీదు మాట్లాడుతూ ఆపదలో ఉన్న సహాయం చేసిన తమ టైలర్స్ యూనియన్ సబ్యులకు కృతజ్ఞతలు తెలిపి, మనలో ఎవరికైనా కష్టం కలిగితే ఇదేవిధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళపూడి మండల టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మరియు వైసిపి మండల యువజన విభాగం అధ్యక్షులు వంబోలు పోసిబాబు, టైలర్స్ వెల్ఫేర్ సొసైటీ  కార్యదర్శి యలమర్తి సుబ్రహ్మణ్యం, కోశాధికారి షేక్ కరిముల్లా, మలకపల్లి గ్రామ టైలర్స్ అధ్యక్షులు కుప్పాల గణపతి మరియు టైలర్స్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...