Followers

వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు









మేయర్ అభ్యర్థిని ప్రకటించే ధైర్యం వైకాపాకు లేదు

విజయనగరం,పెన్ పవర్

 వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అప్రహాస్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. ఓటమి భయంతోనే బలవంతపు ఏకగ్రీవాలు  చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్ కి మేయర్ అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితిలో వైకాపా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజారంజక పాలన చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా నాయకులు ఎన్నికల్లో బెదిరింపులకు, ప్రలోభపెట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ సంస్థలో అడ్డదారిలో చైర్మన్ గా వచ్చిన సంచయిత వివాదాస్పద నిర్ణయాలు
తీసుకుంటుంటే జిల్లాలో మంత్రులు ,ఎమ్మల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు విజయనగరం పట్టణంలో అభివృద్ది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందన్నారు. కేవలం అసత్య ప్రచారాలతో వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. దీనిని చూసి ఓర్వలేక అడ్డదారిలో గెలవాలని వైకాపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. వైకాపాకు అనుకూలంగా ఎన్నికల్లో పనిచేస్తున్న అధికారులు, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఐవిపి రాజు, కరణం శివరామకృష్ణ, త్రిమూర్తులరాజు, విజ్ఞపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...