Followers

గ్రామసచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి

 గ్రామసచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి 



పెన్ పవర్,ఆలమూరు 

   ఆలమూరు గ్రామ సచివాలయం సిబ్బంది ప్రజలందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండి వారికి జవాబు దారితనం గా ఉండాలని జాయింట్ కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి  అన్నారు అమె శుక్రవారం మండల కేంద్రమైన ఆలమూరు సచివాలయంతో పాటు గుమ్మిలేరు సచివాలయం లో జరుగుతున్న ఆన్లైన్ పక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ బీమా,అసరా,చేయూత మొదలగు పథకాలను  సచివాలయానికి వచ్చే ప్రజలందరికీ అలసత్వం వహించకుండా వారికి సకాలంలో దరఖాస్తులు అందజేయాలని అలాగే  ఆన్లైన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని అమె అన్నారు దీనిపై మండల స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు  పర్యవేక్షించాలని  తెలియజేశారు   ఆమెతో పాటు  మండల పరిషత్ పరిపాలన అధికారి టి  సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి డి సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...