Followers

ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు

 ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు 

తెలిపిన  టిఆర్ఎస్ ఫార్టీ ఎస్టిసెల్ నాయకులు



ఎల్లారెడ్డిపేట ,పెన్ పవర్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనుల పక్షపాతి అని .సంగారెడ్డిలో గిరిజనులకు న్యాయ కళాశాల ను మంజూరు చేయడం. ప్రారంభించడం చాలా సంతొషకరమని ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల తండాలోని గిరిజన విద్యార్థులకు గోప్పవరం, దేశంలోనే తొలిసారిగా గిరిజనులకు న్యాయశాస్త్ర విభాగంలో గురుకుల న్యాయకళాశాల మంజూరు చేయడం  తెలంగాణలోని గిరిజన విద్యార్థులకు గొప్ప అదృష్టం , ప్రభుత్వ అధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ న్యాయ విద్యను శనివారం మంత్రులు సత్యవతి రాథోడ్ . హరీష్ రావు  ప్రారంభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గిరిజనుల అందరిపక్షాన సీఎం కెసిఆర్ కు ప్రతేక దన్యవాదములు తెలియజేస్తూ , గిరిజనులందరం సీఎం కెసిఆర్  కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెరాసనాయకులు అజ్మేరా రవి నాయక్. బాలు నాయక్ రమేష్ నాయక్. రామావత్  రవి. రమేష్ .దేవేందర్  నాయక్ . తదితరులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...