మాన్సస్ చైర్మన్ పదవికి సంచయత రాజీనామా చెయ్యాలి!
డాక్టర్ పి.వి.జి.రాజు కళావేధిక డిమాండ్!
విజయనగరం,పెన్ పవర్
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా పేరుపొందిన మాన్సస్ విద్యా సంస్థల పేరుని చెడగొట్టేలా వ్యవహరిస్తోన్న చైర్మన్ సంచయత తనపదవికి రాజీనామా చేయాలని డాక్టర్ పి.వి.జి. రాజు కళావేధిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి డిమాండ్ చేశారు గురువారం సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాన్సస్ సంస్థ పుట్టినరోజు మార్చ్ మూడోవతేది అని తెలిసికూడా చైర్మన్ గా కనీసం సంస్థ ఫౌండర్స్ డే చెయ్యకుండా తప్పించుకు తిరగడం మంచిది కాదని తాను ఆనందగజపతి రాజు వారసురాలునని చెప్పుకు తిరగడమేతప్ప వారి గౌరవాన్ని కాపాడటంలో విఫలమయ్యారని, సంచయత ఛైర్మన్ గా బాధ్యత తీసుకొని మాన్సస్ లో అనేక సంచలనం సృష్టించిన నిర్ణయాలు తీసుకొని మాన్సస్ కి చాలా చెడ్డపేరు తెచ్చిపెట్టారని అన్నారు గతంలో ఆనందగజపతిరాజు చైర్మన్ గా సంస్థ కి ఎంతో గొప్పపేరు తేవడమేకాక వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉంటూ ఉపాద్యాయులని కుటుంబసభ్యులుగా చూసుకుంటూ మాన్సస్ ని నడిపించేవారని అన్నారు,రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ ని ఎందుకు కొనసాగిస్తున్నారని,గత సంవత్సరం విద్యార్థులకి డోనర్స్ ఇచ్చిన నగదు పురస్కారాలు ఏమయ్యాయని,చైర్మన్ గా సంచయత డోనర్స్ కి ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు, ఎండోమెంట్స్ నుండి విడుదలైన నిధుల పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం ఊర్మిలా కూడా మెంబర్ గా ప్రమాణస్వీకారం చెయ్యాలని కానీ సంచయత అడ్డుకున్నారని భీశెట్టి విమర్శించారు, ఎంతో మంది ఉపాద్యాయులని అక్రమంగా తొలగించారని, చాలా మంది ఉపాద్యాయులకి అరవై శాతం జీతాలు ఇచ్చి మిగిలింది ఇవ్వకుండా తిప్పుతున్నారని పాపం ఉపాద్యాయులకుటుంబాలు నిస్సహాయ స్థితిలో రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు,ప్రధాన కార్యాలయం పద్మనాభం కి ఎందుకుమార్చవలసి వచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొందని,సంచయత పిచ్చిపిచ్చిగా నిర్ణయాలు తీసుకోవడం మానుకొని చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని భీశెట్టి డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment