ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కటిన చర్యలు
విశాఖపట్నం, పెన్ పవర్
ఈ నెల 10వ తేదీన జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్థేశించిన ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా అభ్యర్థులు తమ ప్రచారాలను నిలుపుదల చేసుకోవాలని కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అభ్యర్థులందరూ విధిగా తమ ప్రచారాన్ని సోమవారం సాయంత్రం 5 గంటల లోపు ముగించుకోవాలి అన్నారు. ప్రచారాలకు వినియోగించే మైక్ లు,రిక్షాలు,ఆటోలు వంటి ఇతర ప్రచారాంశాలను తప్పనిసరిగా నిర్దేశించిన గడువులోగా ముగించుకోవాలన్నారు. లేని యెడల ఎన్నికల కమిషన్ తీసుకోబోయే చర్యలకు గురి కావాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా ఓటరు తన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఓటర్ సౌకర్యార్థం వెబ్ సైట్ ను రూపొందించడం జరిగిందన్నారు. అలాగే సదరు వెబ్ సైట్ లో ఓటరు పేరు, తండ్రి పేరు,ఓటరు గుర్తింపు కార్టు నెంబరు వంటివి నమోదు చేసిన వెంటనే ఓటరు యొక్క వివరాలు, పోలింగ్ స్టేషన్ వంటి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
వెబ్ సైట్ .. http://13.127.225.132/ULB/1093
No comments:
Post a Comment