మహిళా దినోత్సవం రోజున మహిళలుపై దాడులా..
రాజధాని (అమరావతి) మహిళా రైతులు దుర్గగుడికి పోవాలనుకోవడమే నేరమాప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదా
రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడమే మహిళా రైతులు చేసిన పాపమా
పెన్ పవర్,కందుకూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహిళా దినోత్సవం రోజున రాజధాని (అమరావతి) ప్రాంతం మహిళలపై పోలీసులతో దాడి చేయించడం దుర్మార్గపు ఆలోచనని అమరావతి పరిరక్షణ సమితి జే ఎ సి కన్వీనర్ గోచిపాతల మోషే ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల బధ్రత కోసం ప్రత్యేక చట్టాలు తెస్తామని , మహిళల వైపు ఎవరు కన్నెత్తి చూసిన గన్ కంటే ముందు జగనన్న వస్తాడని సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతూ సాక్షాత్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములు ఇచ్చిన మహిళా రైతులపై దాడి చేయించడాన్ని చూస్తేనే జగన్ మహిళలపట్ల ఏవిధంగా చిన్న చూపు చూస్తున్నాడో అర్థమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళపై అత్యాచారం జరిగితే ఆ రాష్ట్రానికంటే ముందుగా "దిశచట్టం" కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి స్వంత రాష్ట్రంలో మహిళలపై దాడులు , దౌర్జన్యాలు మరియు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్యలు చేస్తుంటే పట్టించుకోకుండా నిస్సిగ్గుగా తిరుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు, నాయకులు రాజధానికి భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్లు అనే పదేపదే పత్రిక సమావేశాల్లో మాట్లాడుతున్నారు. నిజమైన పెయిడ్ ఆర్టిస్ట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే తప్ప రైతులు కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజధాని అమరావతి మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేస్తూ వాడిన బాష వీదిరౌడిలు , గుండాలు వాడే బాష కంటే నీచాతి నీచమైన రీతిలో వ్యవహరించి జగన్ మోహన్ రెడ్డి దగ్గర మెహార్భాని పొందటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల పట్ల చూపుతున్న వివక్ష ఇకనైనా విడనాడాలని లేని పక్షంలో ఈనెల 10 తేదీన రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ , కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మోషే హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు కొత్తగొర్ల వసంత , తానికొండ సునీత , తాటికొండ పద్మ , గంగవరపు పద్మ , కందుకూరు నియోజకవర్గ సి.పి.ఐ సహాయ కార్యదర్శి బూసి సురేష్ బాబు , మహాదేవపురం సొసైటీ మాజీ అధ్యక్షులు దామా మల్లేశ్వరావు , తెలుగుదేశం పార్టీ నాయకులు పొడపాటి మహేష్ , మాదాల మాల్యాద్రి , బత్తిన వెంకయ్య , బి.సి సెల్ మండల అధ్యక్షులు మంచికలపాటి శ్రీనివాసరావు , యస్.సి సెల్ నాయకులు కలవకూరి మణికుమార్ , టి.ఎన్.ఎస్. ఎఫ్ జిల్లా కార్యదర్శి నలమోతు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment