అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ప్రశంసలు
మందమర్రి, పెన్ పవర్ఫిబ్రవరి 28న జరిగిన జాతీయ డ్రాగన్ కుంఫు కరాటే పోటిలో గెలుపొంది, గోవాలో జరుగు అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన మందమర్రి పట్టణానికి చెందిన విద్యార్థులు జి శివాని, డి హర్షిత లను మందమర్రి పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ లు విద్యార్థులను వేరువేరుగా ప్రశంసించి, వారిని అభినందించారు. ఈ సందర్భంగా గోవాలో జరిగే పోటీలో పాల్గొనేందుకు ప్రోత్సాహకంగా పట్టణ ఎస్సై భూమేష్ నాలుగు వేల రూపాయలు, బండి సదానందం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,చిన్న వయసులోనే అంతర్జాతీయ పోటీలు పాల్గొంటున్నా విద్యార్థులు భవిష్యత్తులో మరింతా పట్టుదలతో మరిన్ని లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ వెంకటేష్, ఏం. గట్టయ్య, డి. రాజనర్సు, ఎం. రాజయ్య, హర్షవర్ధన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment