Followers

భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులను యువత ఆదర్శంగా తీసుకోవాలి

 భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులను యువత ఆదర్శంగా తీసుకోవాలి


తార్నాక,  పెన్ పవర్ 

స్వాతంత్ర్య కోసం అమరులైన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఫెడరేషన్ కోశాధికారి చంద్రశేఖర్, యూత్ వింగ్ అధ్యక్షులు రాపోలు వెంకటేశ్వర రావు అన్నారు.  బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలని సంక్షేమ సంఘాల సమాఖ్య ( ఫెడరేషన్ ) యువజన విభాగం అధ్వర్యంలో భగత్ సింగ్,రాజగురు,సుఖ్ దేవ్ ల 90వ వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాపోలు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అని, భగత్ సింగ్ మండే అగ్ని గోళం జ్వలించే నిప్పుకణిక అని, రెపరెపలాడే విప్లవ పతాకం. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచేలా 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడాడని, తన స్నేహితులు విప్లవ యోధులైన సుఖ్ దేవ్,రాజ్ గురులతో పాటూ అసువులు బాశాడని,నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురిని వరుసగ నిల్చోబెట్టి ఉరి తీసిందని అన్నారు. వారి స్పూర్తితో యువత మరింత  పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి,భారత రత్న ప్రకటించాలి.తన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాపోలు పవన్,మంచాల రమేష్, బాలు,శ్రావణ్ ,శివనాగ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...