వనపర్తి అభివృద్ధికి ప్రజలు సహకరించాలి; జిల్లా కలెక్టర్
వనపర్తి, పెన్ పవర్వనపర్తి పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సకాలంలో పన్నులు చెల్లించి సౌకర్యాలు పొందాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు. వనపర్తి పురపాలక సంఘ బడ్జెట్ సమావేశంలో అతిథిగా హాజరై 20 21 -22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తూ పురప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉందని అన్నారు. పట్టణంలో వైకుంఠధామం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పట్టణానికి సమీకృత మార్కెట్ మంజూరైందని త్వరలో పనులు చేపట్టాలన్నారు. పట్టణ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరితహారానికి సంబంధించిన నర్సరీ అభివృద్ధి చేసి 3 లక్షల 75 వేల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఐదు వార్డులకు ఒక నర్సరీ ఏర్పాటు చేయబడింది నర్సరీల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పట్టణానికి టౌన్ హాల్ రాబోతున్నది కలెక్టర్ తెలిపారు. పట్టణ ప్రజలు మునిసిపాలిటీకి సహకరించి సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కలెక్టర తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment