తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించిన విద్యార్థులు
వికారాబాద్ , పెన్ పవర్
వికారాబాద్ జిల్లా పూడూరు మండల్ తిరుమలాపూర్ గ్రామంలో సర్పంచ్ కంలి బాయ్ పెంటయ్య ఆధ్వర్యంలో పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చెశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమేష్ గురూజీ రావడం జరిగింది. అనంతరం తాను మాట్లాడుతూ నేటి యువత సమాజంలో తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కోల్పోతున్నారని తెలపడం జరిగింది. నేటి సమాజంలో చదువు బాగానే ఉంది ఆస్తులు బాగానే ఉన్నాయి కానీ సంస్కారం లోపిస్తుంది అన్నారు. భారతదేశంలో తల్లిదండ్రులను గురువును దైవంగా చూడమని చెబుతున్నారు కానీ స్వార్థం చూపిస్తున్నారు అని తెలిపారు., తల్లిదండ్రులను దైవంగా చూడాలి ,పిల్లలలో జాగృత పెరగాలి అని తెలపడం జరిగింది.పూర్వం నుండి మన దేశంలో తల్లి తండ్రులు లను ద్తెవంగా చూసుకుంటారని అందువల్లనే అప్పటి నుండి నేటి వరకూ తల్లిదండ్రులను పూజింస్తామని గురుజీ వివరించారు ఈ కార్యక్రమంలో అంగోతు గోపాల్ , వరత్య రాములు, రాజ్ కుమార్ ,.గణేష్ .సురేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment