ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లుగా జేఎన్టీయూ విద్యార్థులు
కూకట్ పల్లి,పెన్ పవర్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ 39వ రాష్ట్ర మహాసభలు కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రెడ్డి కూకట్ పల్లి జె.ఎన్.టి.యూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ విద్యార్థులు మంచాల. శేషుశ్రీ, బల్త. రుత్విక్ వర్మలను రాష్ట కార్యవర్గ సభ్యులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా శేషుశ్రీ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినిల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తానని, విద్యార్థినులలో తమ సమస్యలపై తామే పోరాడే విధంగా ఆత్మస్థైర్యాన్ని నింపుతానని, విద్యార్థినులతో కలిసి మహిళ సాధికారత వైపు అడుగులు వేసేలా కృషి చేస్తానని చెప్పారు. రుత్విక్ వర్మ మాట్లాడుతూ విద్యర్ధుల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేసి సమస్యలను పరిష్కరిస్తామని, విద్యార్థుల్లో జాతీయవాదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తామని, విద్యార్థులను దేశాభివృద్ధిలో భాగం చేస్తూ విద్యార్థుల సహకారంతో సెమినర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. వీరి ఎన్నిక పట్ల జె.ఎన్.టి.యూ విద్యార్థులు సాయి కుమార్, వర్షిత్, జ్యోతి, తమ్మినేని పఠాన్ బాబు, శరణ్, రామకృష్ణ, ఇతర విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment