Followers

బీజేపీ హయాంలో అందరికి సముచిత స్థానం

 బీజేపీ హయాంలో అందరికి సముచిత స్థానం: పన్నాల


కూకట్ పల్లి, పెన్ పవర్

బీజేపీ యువమోర్చా మీడియా కన్వీనర్ నాయినేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం పిఎన్ఎం హైస్కూల్ లోని ఇందిరా చంద్రశేఖర్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథి గా బీజేపీ మేడ్చల్ జిల్లా (అర్బన్) అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి హాజరై నూతనంగా ఏర్పాటు అయిన డివిజన్ కమిటీను అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సూచించారు. తాను యువమోర్చాలో కార్యకర్తగా పనిచేసి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ప్రజల ముందు  ఉన్నానాని, బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరికీ సమయం వచ్చినప్పుడు సముచిత స్థానం కల్పిస్తుందని తెలియజేసారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పప్పు పటేల్, బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, బిజెవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కన్వీనర్ పవన్ కుమార్ నాయినేని, బిజెవైఎం మేడ్చల్ (పట్టణ) జిల్లా అధ్యక్షుడు చల్లా ప్రభాకర్, బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ బచాలి వినోద్,  డివిజన్ల అధ్యక్షులు, కమిటీ సభ్యులు సందీప్ నాయక్ , రామ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...