Followers

గుమ్మలక్ష్మీపురం మండలంలో జోరుగా వైసీపీ ప్రచారం

 గుమ్మలక్ష్మీపురం మండలంలో జోరుగా వైసీపీ ప్రచారం

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలంలో రానున్న యం.పీ.టీ.సి ,జడ్.పీ.టీ. సి ఎన్నికలకుగాను వైసీపీ పార్టీ అభ్యర్థులతో పాటు కార్యకర్తలు ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. మండలంలోని 27పంచాయితీలలో ప్రచారహోరులో వైసీపీ శ్రేణులు నిమగ్నమాయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండల వై.సీ.పీ పార్టీ కన్వీనర్ కంబురుకు.దీనమయ్యా సూచనలమేరకు ప్రతీ పంచాయతీలోని మారుమూల గ్రామాలలో కూడా అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తూన్నారు.

నాయకులు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలు గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటెయ్యమని అభ్యర్ధిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇది వరకు జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మండలంలోని అన్నీ పంచాయతీలలో వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించి పార్టీ మార్క్ వేసి వైసీపీ సత్తా చాటినట్లు రాబోయే యం.పీ.టీ.సి, జడ్.పీ.టీ.సీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి ముందుకు సాగే విధంగా ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నట్లు పలువురు కార్యకర్తలు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...