Followers

బస్సును ఢీకొన్న స్కూటీ

 బస్సును ఢీకొన్న స్కూటీ

ఇరువురికి స్వల్ప గాయాలు



విశాఖ పొలిటికల్, పెన్ పవర్

 బుధవారం రాత్రి  గం. 9.30 ని. సమయంలో సింహాచలం డిపో నుండి ముడసర్లోవ రోడ్డు మీదుగా బీచ్ కు వెళుతున్న AP 11 Z 6656 నంబరు గల 65 K ఆర్.టి.సి..బస్సును ఎదురుగా వస్తున్న హీరో హోండా ఆక్టివా AP 31 DD 9459 నెంబర్ గల స్కూటీ  బస్సుకు కుడివైపు గుద్దింది. ఈ సంఘటన పెడగదిలి కూడలి దగ్గరలో సంభవించింది. అయితే అక్కడికక్కడే స్కూటీ పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు కింద పడిపోయారు. వారికి స్వల్ప గాయలయ్యయి. హుటాహుటిన 108 కు ఫోన్ చేసి క్షతగాత్రులను అపోలో ఆసుపత్రి కి తరలించారు. ఈ నేపథ్యంలో బస్సు బంపర్ దెబ్బతింది. స్కూటీ ముందు భాగం బాగా నుజ్జయింది. ద్వారకా నగర్ లో నివాసం ఉంటున్న కొల్లి  ఉమా దేవి మరియు బొప్ప సత్యవతిలు పైనాపిల్ కాలనీ లోని  తమ బంధువుల పెళ్లికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.గాయ పడ్డ వారిని ఆర్.టి.సి. అధికారులు పరామర్శించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...