Followers

జిల్లా వ్యాప్త ఆటోల బంద్ ను విజయవంతం చేయండి

 జిల్లా వ్యాప్త ఆటోల బంద్ ను విజయవంతం చేయండి

మందమర్రి ,పెన్ పవర్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోడ్రైవర్ పట్ల అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ముఖేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే జిల్లా వ్యాప్త ఆటోల బంద్ లో ప్రజలు, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆటో యూనియన్ మందమర్రి పట్టణ అధ్యక్షులు మేడి రాజు  కోరారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మించి హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉప్పరి సుభాష్, కొప్పుల రమేష్, ఎండీ షరీఫ్, దాసరి రాజ్ కుమార్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...