Followers

బిజెపి శిక్షణ తరగతులు ప్రారంభం

 బిజెపి శిక్షణ తరగతులు ప్రారంభం




బెల్లంపల్లి , పెన్ పవర్ 

బెల్లంపల్లి పద్మశాలి భవన్ లో బిజెపి రెండు రోజుల శిక్షణ తరగతులు శనివారం మాజీమంత్రి కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని అదేవిధంగా 2023లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని  అన్నారు. ఈ శిక్షణ తరగతులు 20, 21, రెండు రోజులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారావు, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎర్రవల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి లు మునిమంద రమేష్, శ్రీను, గోపతి మల్లేష్, తాండూరు ఇన్చార్జి రేవెల్లి రాజలింగు, ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, రాపర్తి వెంకటేష్, అనిత యాదవ్, గిరిజన మోర్చా అధ్యక్షులు అజ్మీర శ్రీను, పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...