ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.
కురవి ,పెన్ పవర్
మండల కేంద్రంలోని నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నారాయణ రాజేంద్ర కుమార్ , మాజీ జెడ్పిటిసి అంబటి వీరభద్రం ఆధ్వర్యంలో మంగళవారం కార్యాలయాలు, విద్యాసంస్థలు, విద్య వంతులను కలిసి ఓటును అభ్యర్థించారు, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత రాములు నాయక్ కే వేసి గెలిపించాలని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వారు ప్రచారంలో భాగంగా విద్యావంతులను కోరారు. అదే విధముగా వివిధ గ్రామాలలోని బాధ్యులు గెలుపే లక్ష్యంగా పట్ల పట్టభద్రుల ఇళ్ల లోనికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ఓటు వేయవలసిందిగా కోరారు. అదే విధముగా సుధనపల్లి, కండికొండ తదితర గ్రామాల్లో పట్టభద్రుల ఇండ్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బండి శ్రీనివాస్, వార్డు సభ్యులు బలగాని శ్రీనివాస్, తరాల వీరభద్రం, అవిరె మోహన్ రావు,అంగడి నర్సయ్య, కామిండ్ల వీరన్న, బాదే వీరభద్రమ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment