Followers

యువతీ కనిపించడం లేదు

 యువతీ కనిపించడం లేదు....

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ పొలీస్ స్టేషన్ పరిధిలో మంజుల అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. గౌడవెల్లి గ్రామానికి చెందిన తల్లి పిల్లే గీత , తండ్రి వాసుల కుమార్తె మంజుల వయస్సు 20 సంవత్సరాలు, ప్రైవేట్ ఉద్యోగి. 22.03.2021 మధ్యాహ్నం 12:00 గంటలకు ఇంటిలోంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్ళే సమయానికి ఇంటిలో ఎవరు లేరు. ఆ రోజు సాయంత్రం 3:00 గంటల సమయానికి పిల్లే గీతాకు, ఆమె కూతురు మంజుల ఫోన్ చేసి ఇంటిలోంచి వెళ్లిపోతున్నాను అని చెప్పింది. ఆమెను తల్లీ ఎక్కడున్నావు అని అడిగే సరికి ఫోన్ ఆఫ్ చేసింది. మంజుల తల్లిదండ్రులకు కె. దేవేందర్ అనే తోటి సహా ఉద్యోగి పైన అనుమానం ఉన్నది అని కేసు నమోదు చేశారు. మంజుల వయస్సు 22 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగులు, భాష తెలుగు. పిల్లే గీతా, వాసులు వారి   చుట్టుపక్కల మరియు బంధువుల దగ్గర కూడా వెతికారు. కానీ మంజుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...