Followers

దేశపురోభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర....

 దేశపురోభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర...

పెన్ పవర్,విశాఖపట్నం

దేశపురోభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని మానవహక్కుల కమిటీ రాష్ట్ర కన్వినర్, ఉత్తరాంధ్ర మహిళా కమిటీ సభ్యురాలు శుభ అలియాస్ (చిన్ని) అన్నారు. సోమవారం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరు డివిజన్ పరిధిలో పలు గ్రామాలలొ మహిళలకు సన్మానకార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాలలోని గ్రామాలలొ మహిళలకు మహిళాదినోత్సవంపై అవగాహనలేదన్నారు. గిరి మహిళలకు మహిళా చట్టాలపైన వారి హక్కులపైనా అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సమాజంలో వస్తున్న ఆధునిక పోకడల దృష్ట్యా మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితులలో తమను తాము రక్షించుకునే 'దిశ ' గా అవగాహన చేపట్టామన్నారు.తల్లిగా,చెల్లిగా భార్యగా,ఉద్యోగినిగా పలు రంగాలలో మహిళలు రాణిస్తూ దేశానికి దశ-దిశగా దిక్సూచిగా నిలుస్తున్నారన్నారు. పాడేరు మేజర్ పంచాయితీ సర్పంచ్ గా ఎన్నికైన మహిళ ఉషారాణిని సన్మానించినట్లు తెలిపారు. ఆరోజుల్లో బస్ లో టిక్కెట్టు తీసుకోవడానికి భయపడే స్థాయి నుండి విమానాలు, ఓడలు నడిపే స్థాయికి మహిళ ఎదగడం ఆనందదాయకమన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక కుటుంబ సభ్యులు తండ్రి, సోదరుడు భర్త ప్రోత్సాహం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విశాఖజిల్లా కన్వినర్ రాణి అలానే గిరిజన మహిళలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...