ప్రతి బుధవారం రోగులకు అల్పాహారం అందిస్తాం
స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్
ఆదిలాబాద్ , పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో వచ్చే రోగులకు నేటి నుండి ప్రతి బుధవారం అల్పాహారం అందించడం జరుగుతుందని స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ అన్నారు.స్వస్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈరోజు నుండి ప్రతి బుధవారం రిమ్స్ హాస్పిటల్ లో నిరంతరాయంగా అల్పాహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎంతో మంది ట్రైబల్స్ గ్రామాల నుంచి వస్తున్న రోగులు వారి బంధువులు ఉదయం పూట ఆకలితో అవస్థ పడుతున్నారని ఈ విషయం మా దృష్టికి రావడం తో ప్రతి బుధవారం రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా అల్పాహారం అందించడానికి పూనుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ 10 సంవత్సరాలు పూర్తవడంతో ఇక ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.అన్నదాన కార్యక్రమాలు చేసి అవకాశం రావడం మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు లక్ష్మణ్ సింగ్ పోతివాల్, మున్నా ,పురుషోత్తం, నక్క గణేష్ ,సాయి కిరణ్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment