తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా తేదేపా ఆవిర్భావ దినోత్సవం
పెన్ పవర్, కందుకూరు
తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు వసంత గంగవరపు పద్మ నివాసంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తలుచుకుంటూ మహిళలు సమాజంలో గౌరవంగా ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలు ప్రారంభించి మహిళల అభివృద్ధికి తోడ్పడినారని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రఫీ, గంగవరపు పద్మ, తాడికొండ సునీత, అనుమోలు జోష్ణ, గల్లా పద్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment