Followers

ప్రజలకు అందుబాటులో శాఖాహార,మాంసాహార మార్కెట్ల ఏర్పాటు....కలెక్టర్

ప్రజలకు అందుబాటులో శాఖాహార,మాంసాహార మార్కెట్ల ఏర్పాటు....కలెక్టర్


జిల్లాలోని మున్సిపాలిటీల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్లకు కలెక్టర్ స్థల పరిశీలన

ప్రజలకు అనుకూలంగా ఉండే చోట్లనే మార్కెట్లు ఏర్పాటు చేయాలి

దుకాణ దారులకు కేటాయించిన వద్దనే విక్రయాలు జరుపుకోవాలి

మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలి

మార్కెట్లకు స్థలాలను పరిశీలించిన మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి

మేడ్చల్ మల్కాజిగిరి,పెన్ పవర్



మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో శాఖాహార, మాంసాహార మార్కెట్లకు అవసరమైన చోట్ల స్థలాలకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు.. శనివారం ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి మార్కెట్ల నిర్మాణం కోసం స్థలాలను కలెక్టర్ శ్వేతా మహంతి స్వయంగా పరిశీలించారు.. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, పోచారం, బోడుప్పల్, ఫీర్జాదీగూడ, దుండిగల్, కూకట్పల్లి, నిజాంపేటలలో పలు స్థలాలు కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. పలు చోట్ల శాఖాహార మాంసాహార మార్కెట్లకు కావాల్సిన స్థలం..ప్రజలకు అందుబాటులో ఉందా..? లేదా..లేదా..? అనే విషయాలతో పాటు ప్రస్తుతం మార్కెట్లను ఎక్కడ కొనసాగిస్తున్నారన్న వివరాలను మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు.శాఖాహార..మాంసాహార మార్కెట్లు జనవాసాలకు అందుబాటులో ఉండాలి..



ఈ సందర్భంగా స్థలాలకు సంబంధించిన మ్యాప్ లను పరిశీలించారు. మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండటంతో పాటు ఆమోదయోగ్యంగా ఉండాలని,,అన్ని వసతులకు అనుకూలంగా ఉండాలని, ఈ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు, స్థలాల వివరాలను వెంటనే తనకు ప్రతిపాదనల రూపంలో అందచేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.. నూతనంగా ఏర్పాటు చేయబోయే  మార్కెట్లలో ఆయా మున్సిపాలిటీలలో జనావాసాలకు దగ్గరగా ఉండే విధంగా సర్వే చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు.. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంపొందించే విధంగా ప్రజలకు సౌలభ్యాలు, సౌకర్యాలు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా చోట్ల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్,  జిల్లాలోని ఆయా మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, ల్యాండ్ అండ్ సర్వే రికార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...