Followers

మధ్యాహ్న భోజన పథకంలో ఇదేనా నాణ్యమైన పదార్థాలు...

 మధ్యాహ్న భోజన పథకంలో ఇదేనా నాణ్యమైన పదార్థాలు...



పాలిథిన్ కు  పూత పూసినట్లు ఉన్న  బెల్లం చెక్కిలు..

పెన్ పవర్,విశాఖపట్నం

  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు బలవర్ధకమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం  కాంట్రాక్టర్ల స్వార్థం వెరసి నాణ్యమైన పదార్థాలకు తిలోదకాలు ఇస్తున్నారు.  పాఠశాలలో నాణ్యమైన ఆహార పదార్థాలతో మధ్యాహ్న భోజనం మరియు పుష్టినిచ్చే వేరుశనగ చెక్కిలు,గుడ్లు అందజేస్తున్నారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తున్నా  నాణ్యమైన సరుకులు మాత్రం పిల్లలకు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన  బెల్లం వేరుశెనగ  గుళ్ళతో  తయారుచేసిన చెక్కిలకు  కాంట్రాక్టు కుదుర్చుకోవాలసి  ఉంది. కానీ అధికారులు కాసులకు కక్కుర్తిపడి  కాంట్రాక్టర్ తో చేతులు  కలుపుతున్నారు అన్నది బహిరంగ రహస్యం. కాంట్రాక్టర్లు తమకు నచ్చిన విధంగా చెక్కిన లు  చేయించి సరఫరా చేస్తున్నారు. దీనికి  అనేక సంఘటనలు రోజూ చేస్తున్నాయి. 2 రోజుల క్రితం మాడుగుల మండలం జె డి పేట పాఠశాలలో  పాలిథిన్   పేపర్ కు అతికించి ఉన్నా  వేరుశనగ చెక్కిలు  పిల్లలకు అందజేశారు. ఇచ్చిందే తడవుగా పిల్లలు  నోట్లో పెట్టేసి చెప్పడం చేశారు. వేరుశెనగ పలుకులు బెల్లం పాకం కరిగిపోయే  నోట్లోకి  పాలదిన్  పేపర్ వచ్చింది. తీరా పరిశీలిస్తే  పాలదిన్  పేపర్ కు బెల్లం పాకం వేరుశనగ పప్పు పూసినట్లు ఉంది. వేరుశనగ పప్పు కూడా చెడిపోయిన ట్లు ఉండటం విశేషం. ఈ విషయం ఒకరిద్దరు ఉపాధ్యాయుని ప్రశ్నించగా  ఈసారి అలా రాకుండా చూసుకుంటాం  అన్న సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి   బెల్లం వేరుశనగ పప్పు చెక్కి పరిమాణం  బరువు  ఇంత మేర కేటాయించాలని ఉంది. కానీ అవేమీ కనిపించడంలేదు. బెల్లం  వేరుశెనగ చెక్కి  ఇచ్చేశాం  అంతే.. మధ్యాహ్న భోజన పథకం అమలు పై పర్యవేక్షణ కొరవడింది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న ఈ పథకం ద్వారా నాణ్యతలేని  పదార్థాలు అందజేస్తున్నారు అని  విమర్శలు వినిపిస్తున్నాయి. మండల విద్యాశాఖ అధికారులు  ఆ వైపు కన్నెత్తి అయినా చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పాలిథిన్  పేపర్లు పిల్లలకు హాని కలిగిస్తాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...