గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి
- బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్
గుడిహత్నూర్, పెన్ పవర్గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సమస్యను నిర్మూలించి, ప్రతి ఇంటికి తాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలోని వీధి దీపాలు నిత్యం వెలిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతి మురుగు కాల్వను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే వీలైనంత త్వరగా వీధివీధికి అండర్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని వివరించారు.ప్రతీ దుకాణదారుడు గ్రామ పంచాయతీ లైసెన్స్ తీసుకోవాలని కోరారు. మన గ్రామ అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట పల్లవి, ఈవో సంజీవ్ రావ్, వార్డు సభ్యులు గిరీష్, వినయ్, గంగయ్య, తుకారాం, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment