Followers

గిరిజనులు శ్రమదానం తో నిర్మించుకున్న రోడ్డును పరిశీలించిన పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్

గిరిజనులు శ్రమదానం తో నిర్మించుకున్న రోడ్డును  పరిశీలించిన పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్

పి ఓను ధింసా నృత్యంతో స్వాగతం పలికిన గిరిజనులు  

గిరిజన సాంప్రదాయంగా పూలమాలలతో పిఓకు ఆహ్వానం పలికిన మహిళలు

పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం

పాలకుల కోసం ఎదురు చూసి విసిగిపోయిన  గిరిజనులు  స్వయంగా శ్రమదానం చేసి రోడ్డు నిర్మించుకున్నారు. 9 గ్రామాల గిరిజనుల శ్రమ ఫలితంగా నిర్మించుకున్న రహదారిని మంగళవారం పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ సలిజామల పరిశీలించారు. అధికారి వస్తున్న సమాచారం తెలుసుకున్న  అనంతగిరి మండలం పినకొట కివర్ల  బోనూరు ఆదివాసీ గిరిజనులు గ్రామ పొలిమేరలో వారి సాంప్రదాయ ధింసా నృత్యం తో పిఓకు  స్వాగతం పలికారు. వారు నిర్మించుకున్న రహదారిపై పిఓను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. 

గ్రామంలో మహిళలు గిరిజన ఆచారంగా కాళ్లు కడిగి పూలమాలలు వేసి పిఓను  ఆహ్వానించారు.ధింసాతో  అధికారులకు ఆనందాన్ని పంచారు. అనంతరం పిఓ   గిరిజనులతో ముచ్చటించారు. అధికారులు నాయకుల కోసం  ఎదురు చూడకుండా  శ్రమదానం తో రోడ్డు నిర్మించుకోవడం  సంతోషమని కొనియాడారు.పోడు పట్టాలు అందరికీ అందాయ  లేనివారు వీఆర్వో ల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. 

పొడి పట్టాలు పొందడం వల్ల 13500 రైతు భరోసా వస్తుందని తెలిపారు. ఇంటింటికి రేషన్ బియ్యం పెన్షన్లు  అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందనివారు గ్రామ వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివాదాలకు తావు ఇవ్వకుండా సమైక్యంగా గిరిజను లు కలిసిమెలిసి ఉండాలని పి ఓ అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...