Followers

సూడో ఆర్మీ అధికారిగా మోసం చేస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

 సూడో ఆర్మీ అధికారిగా మోసం చేస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్


కూకట్ పల్లి, పెన్ పవర్

పోలీసు అధికారిగా, మిలటరీ కల్నల్ గా వేషం వేసుకొని బెదిరింపులు, కిడ్నాప్ కు పాల్పడిన నాగరాజు కార్తికేయ రఘువర్మ (22) అలియాస్ కార్తిక్ సింగ్ అనే కేటుగాడిని ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున కె.పి.హెచ్.బి కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నకిలీ కల్నల్ గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అరెస్టు అయిన కార్తికేయ రఘువర్మ. జైలు నుండి విడుదలయ్యాక కూడా తీరు మార్చుకోకుండా దీపక్ కుమార్ బోరా, గడ్డం అనిల్ కుమార్, పైలా స్వామి సత్యనారాయణ, కేళ్ళ శ్రీనుల సహాయంతో పోలీసులమని నమ్మించి కె.పి.హెచ్.బి కాలనీకి చెందిన తమ్మిరెడ్డి దిలీప్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కార్తికేయ. దిలీప్ ను అపహరించుకుపోయి జంగారెడ్డిగూడెంలో బంధించి యాభై వేల రూపాయల నగదు, హోండా సిటీ కారును లాక్కున్న నిందితులు.  జంగారెడ్డిగూడెం నుండి తపించుకొని వచ్చిన తమ్మిరెడ్డి దిలీప్ కే.పీ.హెచ్.బి పోలీసులకు పిర్యాదు చేసాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తికేయతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి నుండి జైలులో ఉన్న కార్తికేయపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కె.పి.హెచ్.బి సిఐ లక్ష్మినారాయణ తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...