Followers

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా  మహమ్మారి

 సెకండ్ వేవ్ కరోనాతో  నగరంలో ఒకరు మృతి

 ఉలిక్కిపడిన  అధికార యంత్రాంగం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక

పెన్ పవర్ బ్యూరో,విశాఖపట్నం

  జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం నగరంలో  కరోనా సోకి ఒక వ్యక్తి మృతి చెందగా 69 కేసులు నమోదయ్యాయని ఉత్తరాంధ్ర కోవిడ్ విభాగం  వెల్లడించింది. 2 రోజుల క్రితం పెందుర్తి లో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చోడవరంలో రెండు కేసులు రావడంతో కరోనా వైరస్ సెకండ్ వేవ్  మొదలైందని భావిస్తున్నారు. తిరుపతి యాత్రకు వెళ్లి వచ్చిన విశాఖ లక్ష్మీపురం చెందిన 56 ఏళ్ల వ్యక్తి  కేజీహెచ్లో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా మహమ్మారి వచ్చి ఈనెల 22 కి ఏడాది కావస్తున్నా విషయం తెలిసిందే. కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రజలు కారో నా  విషయం అంతగా పట్టించుకోలేదు. నవంబర్ డిసెంబర్ వరకు అంతంతమాత్రంగా కేసులు ఉన్నప్పటికీ ఈ ఏడాది  జనవరి ఫిబ్రవరి లో ఎటువంటి కేసులు నమోదు కాలేదు  కరోనా వైరస్  పట్ల ప్రజలకు వేమరు పాటు మొదలైనది. కోవిడ్ 19 నిబంధనల్లో పాటించడం వదిలేశారు. అసలు కరోనా వైరస్ అంటూ ఉందని జనం మరిచిపోయారు. మాస్కులు శానిటైజర్ విడిచిపెట్టారు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రి కళాశాలలో 150 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించారు. కళాశాలలు పాఠశాలల్లో  విద్యార్థులకు వైరస్  సోకినట్లు వస్తుంది. మాస్కులు ధరించాలి శానిటైజర్ ఉపయోగించాలి అంటూ అధికారులు మళ్లీ హెచ్చరికలను మొదలుపెట్టారు. ప్రజల్లో మాత్రం స్పందన కనిపించడం లేదు.కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా కేసులు పెరుగుతున్న దృశ్యం  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాంధ్ర కోవిడ్ ఇంచార్జ్  పీవీ  సుధాకర్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ మొదలైందని ప్రజలు మాస్కులు   ఉపయోగించాలని సూచించారు. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు  జిల్లాలో 69 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 248   కేసులు డిశ్చార్జి కాగా 541 మంది మృతి చెందారని తెలిపారు.  కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని సుధాకర్ అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...