వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపు
ఆత్మకూరు మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగదైవం అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధి కి వచ్చినా భక్తులు తమకు తోచిన నట్లుగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మొక్కు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఆ స్వామి వారి హుండీ లెక్కింపు 28 రోజులుగా నూ ఆలయం ప్రధాన హుండీ నుండి 35,56,866/- రూపాయలురాగా ఆ స్వామివారి అన్నప్రసాద నుండి 5,62,872/- రూపాయలు మొత్తం కలిపితే 41,19,738/- రూపాయలు ఆ స్వామి వారికి బంగారం రూపంలో 162 గ్రాములు వెండి కేజీ 493 గ్రాములు వచ్చినది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు నామ సత్య పెద్దిరాజు వేణుగోపాల స్వామి దేవస్థానం ఈవో రాజమండ్రి జి రమేష్ శ్రీ పోచమ్మ అమ్మవారి దేవస్థానం రాజమండ్రి ఈవో శ్రీ కృష్ణ చైతన్య శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానం ర్యాలీ ఈవో శ్రీలక్ష్మి వివో గ్రూప్ దేవాలయములు వీరితో పాటు ఆలయ చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి శ్రీ వెంకటేశ్వర రావు కనకారావు శెనగల సత్యనారాయణ రెడ్డి రవి దేవి భాను ఆలయ అర్చకుల తో పాటు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ బాబురావు పోలీస్ సిబ్బంది దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment